Wednesday, 18 January 2017

పాఠశాల ప్రహరీ గోడ కు శంకుస్థాపన

పాఠశాల ప్రహరీ గోడ కు శంకుస్థాపన 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన మండలం లోని నంబాల ప్రాథమికి పాఠశాల ఆవరణ ప్రహరీ గోడ కొరకు జిల్లా పరిషత్ నిధుల నుంచి 2లక్షల రూ లతో ప్రారంభించిన పనికి బుధవారం ఎంపిపి సంజీవ్ కుమారు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసారు. ఎంపిపి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అవసరాల నిమిత్తం సంక్షేమ పనులని చేపడుతుందని అందులో భాగంగా నంబల పాఠశాలలో ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురౌతున్నారని గుర్తించి ప్రహరీ గోడని నిర్మించడం జరుగుతున్నదని అన్నారు .  కార్యక్రమంలో గజ్జెల సుసుల, ఎమ్ ఈ ఓ వెంకటస్వామి, ఈ ఈ  జగన్నాథం, డైరెక్టర్ సత్యనారాయణ్, ఎంపిటిసి  శ్రీనివాస్ ,పాఠశాల కమిటీ ఛైర్మెన్ దెబ్బటి సత్యనారాయణ్, రంగు మహేష్ తదితరులు;యూ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment