Monday, 2 January 2017

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో నూతన సంవత్సర సంబురాలు

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో నూతన సంవత్సర సంబురాలు 

 కొమురంభీం( ఆసిఫాబాద్ ) వుదయం : రెబ్బెన మండల కేంద్రములో సాయి విద్యాలయము (ఎస్ వి ) ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సర సంబురాలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్బంగా విద్యార్థులు , ఉపాధ్యాయులు కేకు కట్ చేసి , మిఠాయిలు పంచారు . అనంతరము విద్యార్థులతో ఆటలు , పాటలు , డ్యాన్సులు చేయించారు . డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు . ఈ కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ దీకొండ  విజయ కుమారి హెడ్మాస్టారు డి సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు జె ఉష , రాజన్న , రేష్మ , ఆశ , సుజాత , విద్యాసాగర్ , తిరుపతి ,  ప్రశాంత్ , మధుకర్ తో పాటు విద్యార్థులు ఉన్నారు.

No comments:

Post a Comment