ఉద్యాగాలు ఇప్పిస్తామని ఘరానా మోసం
నిందితున్ని పట్టుకున్న సి ఐ మదన్ లాల్
కొమరంభీం ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 09 రెబ్బెన ; సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ సింగరేణి కార్మికుడు ఘరానా మోసానికి దిగాడు . దీన్ని చాకచక్యంగా రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ కేసును ఛేదించి నిందితున్ని పట్టుకొని జైలుకు పంపారు . వివరాలలోకి వెళితే ... రెబ్బెన మండలములోని గోలేటికి చెందిన గజ్జెల్లి అశోక్ కు ఉద్యోగం ఇప్పిస్తానని బెల్లంపల్లి కి చెందిన మాడుగుల సంపత్ హుస్సేన్ లు 6 లక్షల 70 వేలు తీసుకున్నాడని రెబ్బెన సి ఐ మదన్ లాల్ తెలిపారు . ఎందరో నిరుద్యోగులను , అమాయకులను మోసం చేస్తూ లక్షలలో రూపాయలు సంపాదిస్తూ వస్తున్నారు . ఇతని పై 15 /09 /2015 లో రెబ్బెన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన రెబ్బన పోలీసులు పట్టించుకోక పోవడముతో కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకున్నట్లు సి ఐ మదన్ లాల్ తెలిపారు . నిందితుడు సంపత్ , హుస్సేన్ లను రిమాండ్ చేసి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ ఉన్నారు .
No comments:
Post a Comment