Friday, 6 January 2017

విద్యా, వైద్యం, ఉపాధి హక్కులకై బస్సు యాత్ర ; ఎఐఎస్ఏఫ్, ఎఐవైఏఫ్ పోస్టర్లు విడుదల

   
 విద్యా, వైద్యం, ఉపాధి హక్కులకై బస్సు యాత్ర ; ఎఐఎస్ఏఫ్, ఎఐవైఏఫ్
 పోస్టర్లు విడుదల

కుమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ఆసిఫాబాద్ రాష్ట్రంలో విద్యా, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఎఐఎస్ఏఫ్,ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐవైఏఫ్ జిల్లా అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి లు తెలియజేశారు. బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ లో విడుదల చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం, రాష్ట్రంలో టి.ఆర్. ఎస్.ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సమస్యలు విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగంలో మత పరమైన విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టేందుకు సంస్కరణలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో కె.జి. టూ పి.జీ. ఉచిత విద్యా విధానం అమలు చేయాలని,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్టు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, యస్.సి.,యస్.టి.,బి.సి.కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకున్నవారందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ లతో బస్సు యాత్ర చేస్తున్నామని బస్సు యాత్రను జయప్రదం చేయుటకు విద్యార్థులు,యువజనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు ప్రశాంత్, డివిజన్ కార్యదర్శి సాయి, నాయకులు ప్రణయ్,ఆకాష్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment