Monday, 23 January 2017

విద్యార్థుల సమస్యలను తీర్చాలి ----- ఏ ఐ ఎస్ ఎఫ్

విద్యార్థుల సమస్యలను తీర్చాలి  ----- ఏ ఐ ఎస్ ఎఫ్ 


కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ; విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను తార్చలని ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు అన్నారు  . అఖిల భారత విద్యార్థి సామెఖ్య , ఏ ఐ  వై ఎఫ్ ఆధ్వర్యములో బస్సు జాతా భాగములో రెబ్బెనలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్విర్యం చేయడానికి  కుట్రను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగం  ప్రకారం విద్య ప్రాథమిక హక్కు గా ఉన్న అలంటి విద్యను సంపన్నులకు  పరిమితమయ్యేలా చేస్తున్నాయి అని,  విద్య నిరుపేద ,  బలహీన వర్గల వారికీ అందకుండా పోతుందన్నారు. ప్రభుత్వం  కార్పొరేటు ప్రవైట్ విద్య సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ప్రాంతాల్లో మూసి వేస్తూ ఉన్న వాటిల్లో మౌలిక సదుపాయాలు లేకుండా, ఉపాధ్యా ల పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా అర కొర ఉపధ్యాలతో భోధన చేయిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫై చిన్న చూపు చూస్తూ వ్యవహరిస్తున్నారని అన్నారు, ఇలాంటి వ్యవస్థ ని దూరం చేసే వరకు ఏ ఐ  ఎస్ ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూ తమా  హక్కుల సాధనకై విద్యార్థుల పట్ల ఉంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి  విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు, ఈ సమావేశంలో ఏ ఐ సెస్ ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శంకర్ , అధ్యక్షులు రాములు , కార్యదర్శి అనిల్,  ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులూ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్,  డివిజన్ కార్యదర్శి పుదారు సాయి, ఎం భాస్కర్, ,కస్తూరి రవి, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ , సి పి ఐ మండల కార్యదర్శి జాడి తిరుపతి , రాయిలా నర్సయ్య , లతో పాటు ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య ,ఉన్నారు .   నాయకులూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment