కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26; ఆటోడ్రైవర్లు తాము సమస్యలను పరీక్షించాలని బుధవారం రెబ్బెన మండలములోని ప్రధాన రహాదారిపై రాస్తారోకో నిర్వహించి అనంతరం తహసీల్ధార్ భండారి రమేష్ గౌడ్ వినతి పత్రాన్ని ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ ,ఆటో యూయూనిన్ అధ్యక్షుడు రాజా గౌడ్ లు ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఆటో ఫిట్నెస్ ని ,ఇన్సురెన్సుని పాత పద్దతులునే కొనసాగించాలని గడువు తేదీ దాటినా తరువాత రోజుకు 50 రూపాయల పెనాల్టీ రుసుమును, పెరిగిన రుసుమును తొలగించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన ఆటో డ్రైవర్లకు 1లక్ష రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు . ఈరోజుల్లో ఆటో నడిపి జీవనం కొనసాగించడం చాలా కష్టాంగాఉన్న తరంలో ఆటో ల పై పెనాల్టీ రుసుములను విధించడం తగదన్నారు వెంటనే సమస్యలను పరీక్షించాలన్నారు ఈసందర్బంగా తాహశీల్ధార్ భండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆటో యాజమాన్యుల సమస్యలను పై అధికారుల దృష్టికితీసుకు వెళ్తామని అన్నారు. ఈకాయక్రమంలో ఏ ఐ టి సి మండల అధ్యక్షుడు నర్సయ్య, ఆటో యూనియన్ సెక్రెటారి సంతోష్ , లింగమూర్తి ,గోవింద్ , రవికుమార్, విజయ్ , ప్రభాకర్, బాబా ,సాయికిరణ్ ,శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment