Wednesday, 25 January 2017

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి....


                        ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి....
AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్....

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;  కుమురం భీం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిసి రమేష్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏకరూప దుస్తులు విద్యార్థులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పేద విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉండగా నేటి వరకు దుస్తులు ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎంఇవో గా విధులు నిర్వహించిన ఉదయ్ బాబు పర్యవేక్షణ లోపం వలన విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందకుండ పోయాయని అన్నారు.పాఠశాలలో సుమారు 380 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని అన్నారు.  పేద విద్యార్థుల పట్ల మరియు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో డిఇవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్,డివిజన్ కార్యదర్శి సాయి,నాయకులు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment