సులబ్ కాంప్లెక్స్ నిర్మించండి
వినతి పత్రం ఇస్తున్న సీనియర్ సేవ సభ్యులు శంకరమ్మ
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జనవరి 04 : రెబ్బెన మండల కేంద్రములోని బస్ స్టేషన్ లో సులబ్ కాంప్లెక్ ను నిర్మించాలని బెల్లంపల్లి జి ఎం రవి శంకర్ కు సేవ సమితి సీనియర్ సభ్యులు కుందారపు శంకరమ్మ బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం ఆమె మాట్లాడుతూ గోలేటి నుండి ఎక్కడికి వెళ్ళాలన్న రెబ్బెనకు వెళ్లాల్సిందే అని రెబ్బెన బస్ స్టేషన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని , మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు . అదే విదంగా రెబ్బెనలో ఒక్క కుట్టు మిషన్ కేంద్రాన్ని మంజూరు చేయాలని ఆమె జి ఎం తో తెలిపారు . జి ఎం రవి శంకర్ సానుకూలంగా స్పందించారు . తప్పకుండ సులబ్ కాంప్లెక్ నిర్మిస్తామని హామీ ఇఛ్చినట్లు తెలిపారు . ఈమె తో పాటు సభ్యులు దేవక్క , బోణీ శంకరమ్మ , ఆడే పెంటక్కా లు ఉన్నారు .
No comments:
Post a Comment