Monday, 23 January 2017

ట్రాఫిక్ నియమాలు పాటించడం మన అందరి బాద్యత- జిల్లా ఎస్పీ సన్ ప్రీతి సింగ్

ట్రాఫిక్ నియమాలు పాటించడం మన అందరి బాద్యత- జిల్లా  ఎస్పీ సన్ ప్రీతి సింగ్


 కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ;  రోడ్డు భద్రత వారోత్సవాల చివరి రోజూ జిల్లా వ్యాప్తముగ  పోలిసులు  ప్లకార్డులను ప్రదర్శిస్తూ  స్కూలు విద్యార్థులతో  ర్యాలి  మరియు ప్రదాన కూడళ్లలో    మానవహారం నిర్వహించారు. ఈ రొజు జిల్లా  ఎస్పీ గారు కగజనగర్ లో జరిగిన బహుమతుల ప్రధాన  కార్యక్రమములో పాల్గోన్నారు. గత వారము రోజుల నుండి జిల్లాలో ఎస్పీ గారి ఆదేశానుసారం   ప్రతి పొలిసు స్టేషను పరిథిలో పలు రకలా రోడ్డు భద్రత అవగహన సదస్సులు ర్యాలీలు మరియు యువతను ట్రాఫిక్ మిత్ర     అనే పేరుతో   స్వయంగా ట్రాఫిక్ రేగులషెన్ లో పాల్గొన్నారు.  ఆటో డ్రైవర్లకు కంటి పరిక్షలు చేయించడం  జరిగింది ఇందులో భాగంగానే ఈ నెల 20 తేదీన రోడ్డు భద్రత  పై  జిల్లా మొత్తంగా స్కూలు పిల్లల తో పెయింటింగ్ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. వీరిలో పెయింటింగ్ లలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి  వారికి ప్రధమ ద్వితియ మరియు తృతీయ  బహుమతులు అదేవిదంగా వ్యాస రచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 3000/ లు ద్వితీయ బహుమతి కి 2000/_ లు, తృతీయ బహుమతి కి 1000/_ లు చొప్పున రెండు పోటీలలో గెలుపొందిన వారికి అందజేశారు వీరిలో పెయింటింగ్ లో ఉత్తమ  చిత్రలేఖనం    గీసిన జులేఖకు   వివేకనంద జానియర్ కాలేజ్ కగజనగర్ కు  ప్రథమ బహుమతి   కౌశిక్ షింగ్ వివేకానంద జూనియర్   కాలేజ్  ద్వితీయ బహుమతి,     పి స్వప్న తృతియ బహుమతులు   జిల్ల ఎస్పీ గారు అందజేశారు. అదేవిధంగా వ్యాసరచన పోటీలో ముక్క సాయి కిరణ్ సరస్వతి శిశుమందిర్ కు ప్రధమ బహుమతి, ప్రియంకా కు ద్వితియ బహుమతి, ఎన్ నర్మదా కు తృతీయ బహుమతి ఇంగ్లీష్ వ్యాస రచన పోటిలో తన్వీర్ ఫాతిమా ఫాతిమ కాన్వెంట్ హై స్కూలు  నగదు బహుమతి గెలుచుకున్నారు.ఈ సందర్బముగా జిల్ల ఎస్పీ సన్ ప్రీతి సింగ్ మాట్లడుతూ జిల్లా పోలిసులు గత వారం రోజులుగా ప్రజలతో మమేకమై వారి వారి పరిధిలలో అనేక కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్య పరిచారని ప్రజలు కుడా పోలిసులకు సహకరించారని అభినందించారు.ప్రజలు తమ వాహనాలను ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ మరియు  సీట్  బెల్ట్ దరించి  వాహనాలను నడపాలని, ముఖ్యముగా  యువత మద్యం సేవించి సెల్ ఫొన్ మాట్లడుతూ వాహనాలను నడపరాదని  రాష్ డ్రైవింగ్ చెయ్యకూడదని  యువత సన్మార్గములో  నడిచి  భవిశ్యత్తులో మంచి   ఉన్నత స్థానానికి ఎదగాలని  ఆయన  చెప్పారు ప్రజలు ప్రమాదాలకు గురి అయ్యి తమ కుటుంబ సభ్యులకు శోకం మిగిల్చ కూడదని కొరారు. ఇక పై ట్రాఫిక్ నియమాలను అతిక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు ప్రతి వ్వక్తి ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కల్గి ఉండాలని సమాజం   పట్ల బాధ్యత యుతముగా వ్యవహరించాలని అయన కొరారు. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ డిఎస్పీ కాగజనగర్ హబీబీఖాన్ టౌన్ సీఐ నాగేందర్, ఆటో డ్రైవర్లు, నవోదయ విద్యాలయం స్కూలు విద్యార్థులు ఇతర ప్రజల పాల్గొన్నారు. 

No comments:

Post a Comment