Saturday, 21 January 2017

రోడ్డు భద్రత నియమాలు పాటించడం అందరి బాద్యత- జిల్ల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

రోడ్డు భద్రత నియమాలు పాటించడం అందరి బాద్యత- జిల్ల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 :  28 వ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం  జిల్లా ఎస్పీసన్ ప్రీత్ సింగ్ ఆదేశాలనుసారం జిల్లా పోలిసులు తమ తమ స్టేషను పరిధులలో ప్రతి వాహనం వెనుకాల ఎరుపు రంగు  రేడియం  స్టికేర్స్ లెని వాహనాలను గుర్తించి అప్పటికప్పుడు రేడియం స్టిక్కర్స్ అతికించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తమ వాహనాల వెనుకల రేడియం స్టికర్లు పెట్టాలని తద్వారా రాత్రి వేళలో వాహనాన్ని గుర్తించి ప్రమాదాలను అరికట్ట వచ్చునని వాహన దారులకు అవగహన కల్పించారు.అదేవిదంగా హెల్మెట్ లెని వారికి అప్పటికప్పుడు హెల్మెట్ కొని ఇప్పించేలా ప్రతి పొలిసు స్టేషను పరిథిలో హెల్మెట్ సెల్లెర్స్ లను ఎర్పాటు చేశారు అంతేకాకుండా  హెల్మెట్ ధరించి వచ్చే వాహన దారులకు పోలిసులు పువ్వులను ఇస్తూ  వారిని ప్రోత్సహించారు. హెల్మెట్ లెకుండా కొనకుండా ఉన్నవారికి జరిమానా విధించారు.ఈ సందర్బముగా ఎస్పీ మాట్లడుతూ జిల్లా వ్యాప్తముగా  ఈ రోజూ  పోలీసులు హెల్మెట్ మరియు రేడియం స్టిక్కర్లు మీద ప్రజలకు అవగహన కల్పిస్తున్నారని ప్రజలు కుడా పోలిసులకు సహకరించాలని తమ అమూల్యమైన ప్రాణాలను రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అందరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కొరారు.

No comments:

Post a Comment