ఐకేపీ వీవోఏ సమ్మె నోటిస్
కొమురం బీమ్ ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 16; రెబ్బెన ; కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వివిధ పథకాల (స్కిం )లలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యల కోసం ఈ నెల 20న చేపట్టే బంద్ పిలుపు మేరకు సమ్మె నోటిస్ ను ఐకేపీ వి ఓ ఏ లు గౌతమి మండల సమాఖ్య రెబ్బెన ఏపీఎం వెంకటరమణ కు ఇచ్చారు. ఐకేపీ వీవోఏ ల మండల అధ్యక్షుడు జి భీమేష్ మాట్లాడుతూ వీవోఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని ,42 నెలలుగా ఉన్న బకాయి వేతనాలను చెలాయించాలని ,కనీస వేతనం అమలు చేయాలనీ ,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ,సంఘాలకు వడ్డీలేని ఋణం 10 లక్షలవరకు పెంచాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాస్ ,కార్యదర్శి ఎం తిరుపతి ,కోశాధికారి డి తిరుపతి ,రవి ,కృష్ణ ,శంకర్ ,శ్రీకాంత్ ,సులోచన ,లింగన్న ,శేఖర్ తదితర వీవోఏ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment