Wednesday, 25 January 2017

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26; పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు . బుధవారం మండలములో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు . పులికుంట లో 36 లక్షతో బిటి రోడ్లకు ,పాత పులికుంట 10 లక్షలకు కావర్తులకు , నంబాలలో బిటి రోడ్లకు షాకు స్థాపనలకు భూమి పూజలు చేశారు . అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ఆపరేషన్ గది ప్రారంభించారు . వారు మాట్లాడుతూ మండలములో చెరువులను ఎంతో అభివృద్ధి చేశామని , 3 వ విడతలో మరిన్ని పనులు చేపడతామని పేర్కొన్నారు . రక్షిత మంచి నీటి పథకము  పనులు వేగవంతముగా జరుగుతున్నాయని , ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందిస్తామని , ఇది కేవలం కె సి ఆర్ ఘనత అని పేర్కొన్నారు ,. దళిత బస్తి పేరు మీద పార్హులైన వారికి 3 ఎకరాల భూమిని ఇస్తామని తెలిపారు .  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ ఏ ఎం సి  కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక ,  సర్పంచ్ వెంకటమ్మ, సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,   ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్,  మోడెమ్ సుదర్శన్ గౌడ్,  ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్ తధీతరులు ఉన్నారు.

No comments:

Post a Comment