మహిళలను రక్షించడమే షీటీంల లక్ష్యం :సీఐ మదన్ లాల్
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జనవరి 04; మహిళలను రక్షించడమే షీటీంల లక్ష్యమని రెబ్బేన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అన్నారు. రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల విధ్యార్ధులకు బుధవారం రెబ్బెన పోలీస్ సర్కిల్ అద్వర్యం లో షీ టీం ల పై అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు అమ్మాయిలను, స్త్రీ లను రక్షించడమే షీ టీంల పని అని అన్నారు. స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన,దుర్బాషలాడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ అభ్యున్నతి,స్వేచ్ఛ గ రోడ్ల పై తిరిగే రోజులు కల్పించే దిశగా కృషి చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరు దీనికి సహకరించగలరని కోరారు.మహిళా పై నిత్యం జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షీ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.అమ్మాయిలను, మహిళలను కించపరిచే ఆకతాయిలను పట్టుకునేందుకు డివిజన్ స్థాయిలో ఒక షీ టీం మఫ్టీ లో నిరంతరం పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న,వేధింపులకు గురిఅవుతున్న పోలీస్ జిల్లా శాఖ చరవాణి నెంబర్ 7995800776, 100 కి కాల్ చేస్తే వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని అన్నారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలఅనుసారం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిణని చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. యువత పెడదారిని వదిలి బంగారు భవిష్యత్తుకు కళాశాల సమయంలోనే పునాదులు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్,కళాశాల ప్రిన్సిపల్ కర్ల వెంకటేశ్వర్,షీ టీం బృందం వాని శ్రీ, కోమల,పొలిసు సిబ్బంది సి ఎహ్ రవీందర్ , ఉమేష్, అధ్యాపకులు అథియాఖనామ్, శాంతకుమారి,వనమాల,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment