Thursday, 26 January 2017

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి -కలెక్టర్


ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి -కలెక్టర్ 

 గణతంత్ర దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ జండా ఆవిష్కరణ

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 27 ;  ప్రభుత్వము అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కళేల్టార్  చంపాలాల్  అన్నారు .గణతంత్ర దినోత్సవము సందర్బంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి , వందన స్వీకారం పొందారు . ఆయన  మాట్లాతు  జిలాలో ప్రతీ శాఖలో ని అధికారులు తమ పనిని అంకిత భావముతో పనిచేస్తే జిలా సర్వత్రా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు .జిల్లా ను అభివృద్ధి దిశలో నడవాలంటే అధికారుల సహకారము తప్పనిసరని అన్నారు . అదే విదంగా ఎస్పీ కార్యాలయములో ఎస్పీ సుప్రీత్ సింగ్ , డి ఈ  ఓ కార్యలయములోడి ఈ  ఓ రఫీక్ , త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు .   వివిధ శాఖలలో ఉత్తమ అధికారులుగా ఎంపికైన వారికి  కలెక్టర్ చంపాలాల్ అవార్డులు అందజేశారు . ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అబ్బుర పరిచాయి . అనంతరము భౌహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమలో  ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్  , ఎం ఎల్ లు కోవా లక్ష్మి , కోనేరు కోనప్ప , ఇతర అధికారులు , నాయకులు పాల్గొన్నారు .    

No comments:

Post a Comment