Wednesday, 25 January 2017

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగ ప్రతిజ్ఞ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగ  ప్రతిజ్ఞ 


కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;    జాతీయ ఓటర్ దినోత్సవం  సందర్బంగ బుధవారంనాడు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేసారు.ఈ  సందర్బంగ రెబ్బెన మండల తహశీల్ధార్ బి.రమెష్ గౌడ్,ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్,జడ్పీటిసి ఎ.బాబురావులు మాట్లాడుతు  18 సం"రాలు వయసు నిండిన యువతీ యువకులు తమ  ఓటు  హక్కు పొందటానికి విధిగ దరఖాస్తు  చేసుకోవాలని అన్నారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా యువకులు ఓటు హక్కు పొందడానికి ప్రతేకంగా  పోలింగ్ కేంద్రలను  ఏర్పాటు చేయడం జరిగిందని,కేంధ్రాలలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు.పరిసర ప్రాంతాలలో నివాసం వుండే చసదువుకోని ప్రజలు నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహనా కాల్పించి నమోదు చేసుకునేందుకు విద్యార్థులు సహకరించిగలరని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు.ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు.భారత పౌరులమైన మేము,ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో,మన దేశ ప్రజాస్వామ్య సాంప్రాదాయాలను,స్వేచ్చయుత,నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడాతామని,మతం, జాతి,కులం,వర్గం,బాషా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారు ప్రతిజ్ఞ చేశారు.ఎంఎంసీ ఉపాద్యాక్షురాలు కుందారపు శంకరమ్మ,రెబ్బెన సర్పంచ్ పెసారు వెంకటమ్మ,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,కళాశాల ప్రిన్సిపాల్ కర్ల వెంకటేశ్వర్,పాఠశాల హెచ్.ఎం స్వర్ణలత,సర్పంచు లు,ఆధాపకులు,ఉపాధ్యాయులు తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,చిన్న సోమశేఖర్,తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు మిట్ట దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment