Thursday, 12 January 2017

ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుర్గం రవీందర్

ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుర్గం రవీందర్

కుమురం బీమ్ ఆసిఫాబాద్  ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ; అఖిల భారత విద్యార్థి సమఖ్య (ఎఐఎస్ఏఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవిందర్ ను ఎకగ్రివంగా ఎన్నుకున్నట్లు ఎఐఎస్ఏఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేణు తెలియజేశారు. బుధవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎఐఎస్ఏఫ్ ఉమ్మడి జిల్లా నిర్మాణ మహసభల్లో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.అనంతరం వేణు మాట్లాడుతూ రవీందర్ విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్నాడని అన్నారు. రవీందర్ 2006లో పాలిటెక్నిక్ కళాశాల ఇంచార్జ్ గా ,2009లో రెబ్బెన మండల కార్యదర్శిగా,2013లో ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శిగా,2015లో ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా,2016లో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశారని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి,తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని అన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరి ప్రశాంత్ ను ఎన్నుకున్నారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తానని, తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి,పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:

Post a Comment