ప్రధమ హాసభను విజయవంతం చేయండి
కుమురం బీమ్ ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ; బహుజన ముక్తి పార్టీ బిఎంపీ రాష్ట్ర మొదటి మహాసభ ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు సురేందర్ సింగ్ అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రం లోని అతిధి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడారు. ఈ నెల 21 న హైదరాబాద్ లో సుందరయ్య కళానిలయంలో మహాసభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహాసభకు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలు బారి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి కోరారు. అగ్రవర్గల వారు తెలంగాణ ఉద్యమం పేరా అధికారాన్ని చేజిక్కించుకుంటే అవినీతి వ్యతిరేకం పేరా మరో అగ్రవర్గం అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు.అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట బహుజనులను అడుక్కునేవారిగా బానిసలూ గ మారుస్తున్నారని వారు అన్నారు.ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు స్థాపించబడినదే బహుజన ముక్తి పార్టీ అని అన్నారు. పూలే అంబేద్కర్ ఆశయాల బాటలో అడుగులు వేస్తూ బహుజనుల అభివృద్ధికి కృషి చేస్తూ లక్ష్య సాధనలో బీఎంపీ ముందుంటుందని వారు అన్నారు.ఏ సమావేశం లో బీఎంపీ నాయకులు డోంగ్రి వాసుదేవ్,డోంగ్రి గణపతి,ముంజం వినోద్,ఇగురపు తిరుపతి,రాంచెందర్,.అజమేరా శంకర్,రాజరామ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment