Friday, 6 January 2017

జర్నలిస్ట్ పిల్లల విద్య కోసం 50 % రాయితీ ని ప్రకటించడం సంతోషకరం ; అబ్దుల్ రెహమాన్

జర్నలిస్ట్ పిల్లల విద్య కోసం 50 % రాయితీ ని ప్రకటించడం సంతోషకరం ; అబ్దుల్ రెహమాన్
డీఈఓ చేతులా మీదిగా ఉత్తర్వులు  అందుకుంటున్న టిడబ్ల్యుజె కన్వీనర్ అబ్దుల్ రెహమాన్ 

కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) జనవరి 06 ; కొమరంభీం ఆసిఫాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో చదువు కొరకు 50 % రాయితీ ని కల్పిస్తూ డీఈఓ శుక్రవారం జారీ చేసారని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులందరు సద్వినియిగం చేసుకోవాలని  టి యు డబ్ల్యు జె (ఐ జె యు  )కన్వీనర్  అబ్దుల్ రెహమాన్ అన్నారు. జర్నలిస్ట్ సంఘ నాయకులూ టి డబ్ల్యు జె అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల పిల్లలకు రాయితీలు కల్పించినందుకు కలెక్టర్ చంప లాల్ మరియు డీఈఓ రఫీక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం జర్నలిస్ట్ పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలో రాయితీలు కావాలని వినతి పత్రాలు ఇచ్చినందుకు అధికారులు  స్పందించి రాయితిలను కల్పించడం జరిగిందని  అన్నారు . ప్రభుత్వం గుర్తించి రాయితీలను ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే జర్నలిస్ట్ లందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమం లో టిడబ్ల్యుజె ఆర్గనైజ్ సేకరెట్రీ వేణు గోపాల్ ,అక్రిడేషన్ కమిటీ మెంబెర్ ప్రకాష్ గౌడ్ ,జిల్లా నాయకులూ హరి కృష్ణ ,రాజ్ కుమార్  ,సురేష్,సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment