పనికి ఫలితం ఏది ..... ? ఐకెపి వి ఓ ఏ లు
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 : ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళా సంఘాల కు చేరవేయడం లో ఐకెపి విఓఏ లు ప్రముఖపాత్ర వహిస్తూ గత 15 సంవత్సరాలనుంచి వెట్టి చాకిరీ చేస్తున్న వేతనాలు ఇవ్వకుండా పనికి తగ్గ ఫలితం లేదని విఓఏ ల జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి భేమేష్ అన్నారు . రెబ్బెన లో గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృతకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేశారు. అనంతరం విఓఏ ల జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి భేమేష్ మాట్లాడుతూ మహిళ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ,స్త్రీనిధి ఋణం ,పిఒపి రుణాలు ,అభయహస్తం ,ఆమ్ ఆద్మీ భీమా యోజన ,జనశ్రీ భీమా యోజన ,ఇన్సూరెన్స్ ల తో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలను విజయవంతం చేయడం లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నామని అన్నారు . ప్రభుత్వం ఎన్నికల ముందు ఐకెపి విఓఏ లకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కానీ ఇంతవరకు నెరవేర్చకుండా జీతభత్యాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృత మాట్లాడుతూ విఓఏ లు లేకపోతే స్వయం సహాయక సంఘాలు పని చేయవని,విఓఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు అలాగే విఓఏ సమస్యలను జిల్లా సమాఖ్య దృష్టికి తీసుకెళ్తామన్నారు . ఈ సమావేశం లో ఏపీఎం వెంకటరమణ , జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్రి తిరుపతి ,మండల ఉపాధ్యక్షులు మెర్లే తిరుపతి ,మండల కార్యదర్శి శ్రీకాంత్,లింగన్న,కృష్ణ, సులోచన ,శంకర్ ,రవి తదితర విఓఏ లు పాల్గొన్నారు
No comments:
Post a Comment