Tuesday, 31 January 2017

అంటరానితనం నిర్ములణకు అందరూ పాటు పడాలి-జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అంటరానితనం నిర్ములణకు అందరూ   పాటు పడాలి-జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; హక్కుల దినోత్సవం(సివిల్ రైట్ డే)  సందర్బముగా జిల్లా ఎస్పీ  ప్రతి పొలిసు స్టేషను పరిథిలో అదికారులు ఇతర మండల  అదికారులతో కలిసి, మారు మూలా గ్రామాలలో అంటరానితనం పై  అవగహన సదస్సులను నిర్వహించాలని అదేశించారు.ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ మాట్లడుతూ  ఇప్పటికి మరుముల గ్రామాలలో ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాల పైన సివిల్ రైట్ చట్టలపైనా ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన అన్నారు చట్టాలు చాలా కఠినతరం అయినవి అని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతాయన్నారు.ఎస్పీ ఎస్టీ కులాల వారిని  అంటరాని వారిగా చూడడం  వారిని ఊరి నుండి బహిష్కరించడం గాని వేలి వేయడం గాని, దేవాలయాలకు అనుమతి నిరాకరించడం గాని   అంటరానితనం  పేరుతో హోటల్స్ లో సపరేట్  గ్లాస్ ఇవ్వడం  మరియు సహపంక్తి భోజనం చెయ్యడానికి వారిని  నిరాకరించటం చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అయన తెలిపారు ఇకపై ప్రతి నెల పొలిసు అదికారులు వారి మండల ఆఫీసర్ల తో కలిసి నెల చివరి రోజున మండల మరుముల గ్రామాలలో చట్టాలపై అవగహన కల్పిస్తారని తెలిపారు.

No comments:

Post a Comment