ఎఐఎస్ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి గ పర్వతి సాయికుమార్ ఎన్నిక
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) రెబ్బెన మండల కార్యదర్శి గ నంబాలకు చెందిన ఇంటర్ విద్యార్థి పర్వతి సాయికుమార్ ఎన్నుకోవడం జరిగిందని ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలియజేశారు. సోమవారంనాడు రెబ్బెనలో ఏర్పాటు చేసిన మండల సమావేశంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిజేశారు.వారు మాట్లాడుతు రెబ్బెన మండలంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు.విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పోరాటం చేయడంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ముందు ఉంటుందని అన్నారు.ఈ సందర్బంగ నూతనంగ ఎన్నికైన మండల కార్యక్యాదర్షి పర్వతి సాయి మాట్లాడుతు విద్యారంగ సమస్యలపై నిరంతర విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,తన పై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పిన జిల్లా,డివిజన్ కార్యదర్శులు దుర్గం రవిందర్,పూదరి సాయిలకు కృతజ్ఞతలు తెలిజేశారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మహిపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్,గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షులు పూదరి హరీష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment