రైతులను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వం:రితేష్ రాథోడ్

కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జనవరి 07 ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం పూర్తిగ రైతాంగాన్ని విస్మరిస్తూ రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యిందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి రితేష్ రాథోడ్ అన్నారు. శనివారంనాడు రెబ్బెన రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో రూణ మాఫీ చేయకుండా రైతు ఆత్మహత్యలను కళ్లచూస్తుందని విమర్శించారు.ఒకేసారి రూణ మాఫీ చేయాకుండా దఫాలు గ చెల్లించడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని, దఫాలు గ చెల్లించిన రూణా మాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోయాయని రైతులకు జరిగినది ఏమి లేదని అన్నారు.పతికి గిట్టుబాటు ధరఖ్ ఉండదేమో అని రైతులు సోయాబీన్ పంటను ఎక్కువ పండించారని కానీ దానికి గిట్టుబాటు ధర లేకరైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారాయికి 20000 నష్టపరిహారం చెల్లించాలనిడిమాండ్ చేసారు. అదే విధంగా నిరుద్యోగం పెరిగిపోతున్నప్పటికీ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను న భర్తీ చ్రయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్,యువజన మండల అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఏ.రమేష్,నాయకులు నవీన్,కోడిపె వెంకటేష్ బొడ్డు విజయ,అడప తారక్క, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment