Monday, 2 January 2017

వి ఓ ఏ లను కించపరిచిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం

 వి ఓ ఏ లను కించపరిచిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఐకేపీ వి ఓ ఏ ల  సమస్యల ఫై చలో హైదరాబాద్ వెళ్లిన వి ఓ ఏ లను కించపరుస్తు మాట్లాడి అవమాన పరిచిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  దిష్టి బొమ్మను సీఐటీయూ అద్వర్యం లో సోమవారం నాడు రెబ్బేన మండల కంద్రం లోని బస్టాండ్ వద్ద దహనం చేసారు. ఈ సందర్బంగ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్,వి ఓ ఏ  ల మండల అధ్యక్షుడు గజెల్లి భీమేష్ మాట్లాడుతు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఐకేపీ  వి ఓ ఏ లకు 5500 వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత 40 నెలలుగా వేతనాలు పెండ్డింగ్ లో ఉన్నా ఎలాంటి స్పందన లేదని  అన్నారు.ఈ సమస్యలు పరిష్కరించకపోగ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఐకేపీ వి ఓ ఏ లు సంభందిత మంత్రి దృష్టి కి తీసుకెళ్తే సంభంధం లేకుండా ఏమి పట్టనట్టు వ్యవహరించి అసలు ఐకేపీ వి ఓ ఏ లు ఎవరని వారికి ప్రభుత్వానికి ఏమి సంబందం అని అనడం ఎంతవరకు సమంజసం అని,సెర్ఫ్ ద్వారా వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదని బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన మాటలను  జూపల్లి కృష్ణారావు  వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఐకేపీ వి ఓ ఏ ద్వారానే ప్రభుత్వ పధకాలు,డ్వాక్రా రూణాలు,ఇతర సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయాలని ఫై అధికారులు ఒత్తిడి చెసి వి ఓ ఏ ల ద్వారానే అనేక పనులు చెయించుకుంటున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఐకేపీ వి ఓ ఏ లకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో మండల వి ఓ ఏ లు డి.శంకర్,ఎం.శ్రీనివాస్, ఎల్.పరమేష్, సిహెచ్.తిరుపతి,ఆర్.కృష్ణ,లింగన్న,చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment