Thursday, 19 January 2017

ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే పోలీసులు -జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే పోలీసులు  -జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 


కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ పరిష్కరించడం కోసమే పోలీసులు ఉన్నారని జిల్లా ఎస్పి  సంప్రీత్ సింగ్ అన్నారు . ఈ నెల 10 వ తేదీన మాలాంగొంది గ్రామము అసిఫాబాద్ మండలము లో ఎస్పీ దంపతుల  ఆధ్వర్యములో జరిగిన నేత్ర వైద్య శిబిరం లో పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు మరియు మందులు పంపిణి చేయడం జరిగిందని  అందులో భాగంగానే 16 మంది వృద్ధులకు కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు వెంటనె స్పందించిన ఎస్పీ గారు సంబందిత వైద్యులతో మాట్లాడి వారికి కంటి ఆపరేషన్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు.  ఈ రోజు ఆ 16 మంది వృద్దులకు మంచిర్యాల ఆసుపత్రిలో ఆపరేషన్ చెయ్యడానికి వైద్యులను సిద్ధం చేసి వారిని పోలిసుల వాహనంలో స్వయంగా ఎస్పీ దగ్గరుండి  వారితో మాట్లడుతూ దైర్యంగా ఉండాలని తమ వెంట పోలిసులు ఉన్నారని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి తమ వంతు సహాయం చెయ్యడానికి ఏళ్ల వేళలా ముందు ఉంటామని ఎస్పీ గారు వారికి భరోసా ఇచ్చి వారిని  ఎఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి  పొలిసు వాహనంలో కూర్చోబెట్టి జెండ ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమములొ అసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్ సీఐ సతిష్ ఆర్ ఎస్ ఐ  వామన అనిల్ లు పాల్గొన్నారు.                        

No comments:

Post a Comment