గాంధీ వర్ధంతి సందర్బంగా మౌనం
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; గాంధి వర్ధంతి సందర్బంగా మరియు స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు సోమవారం రెబ్బెనలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ స్వతంత్య్ర ఉద్యమంలో అమరుల కొరకు మరియూ గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించడం జరిగింది.దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ దారం సురేష్,ఈవోపిఆర్డి కిరణ్, నవీన్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్ ,ఆశోక్, రంగు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment