Sunday, 1 January 2017

త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు

త్రాగు నీరు లేక  తీవ్ర ఇబ్బందులు 

                                                 ఖాళి బిందెలతో రాష్ట్రీయ రహదారిపై రాస్తా రోకో
కొమురం భీం ఆసిఫాబాద్, రెబ్బెన : రాష్ట్ర ప్రభుత్వం త్రాగు నీటి కోసం ఎన్నోలక్షలు ఖర్చు పెడుతుండగా గ్రామాలలో మాత్రం త్రాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రెబ్బెన మండలములోని  కొండపల్లి గ్రామ పంచాయతీ లోని నేర్పల్లి గ్రామ ప్రజలు తగు నీటి కోసము ఆదివారము రాష్ట్రీయ రాహదారిపై ఖాళి బిందెలతో రాస్తా రోకో నిర్వహించారు . పురుషులు ఎడ్ల బండ్లతో రోడ్డు పైకి ఎక్కారు . దీంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది . లారీలు బస్సులు ఎక్కడివి అక్కడ నిలిచి పోయాయి . ఈ విషయం తెలుకొన్న ఎం పిపి కార్నాథం సంజీవ్ కుమార్ , రెబ్బన సి ఐ మదన్ లాల్  ప్రజలకు నచ్చ్చజెప్పారు . కానీ ససేమిరా ఆ ఊరి ప్రజలు మాట వినక పోవడముతో ఎం పిపి సంజీవ్ కుమార్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ కు  , ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి లకు ఫోన్ ద్వారా సమాచారం ఇఛ్చి మాట్లాడారు . 20 రోజుల్లో గ్రామములో విద్యుత్ కొరత లేకుండా చూస్తామని , త్రాగు నీటి కొరతను కూడా తీరుస్తామని హామీ ఇచ్చ్చారు  . అంతవరకు ప్రతి రోజు 2 ట్యాంకర్ల  తో నీటి సరఫరా చేస్తానని హామీ ఇవ్వగా సి ఐ మదన్లాల్ కూడా ఒకా ట్యాంకు త్రాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చ్చారు .దీనితో  ఆ గ్రామ ప్రజలు రాష్ట్ర రోకోను విరమించారు .గత కొన్ని రోజులుగా ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న త్రాగు నీటి సమస్య ఇప్పటికైనా నెరవేరుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment