Thursday, 5 January 2017

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్....

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ;
ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్....

కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) సిర్పూర్ ; జనవరి 05; రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తెరాస  ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.గురువారం రోజున సిర్పూర్ టీ లో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో రస్తారోకొ చేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్న నేటి వరకు సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు చలిలో నిద్రపోతున్నరని,చలి వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.వసతి గృహలకు కనీసం కిటికీలు లేని దుస్థితి ఏర్పడింది. కాంట్రాక్టు లెక్చరర్స్ గత వారం రోజుల నుండి సమ్మె చేస్తున్నారని,మరో కొద్ది రోజుల్లో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయని కాంట్రాక్టు లెక్చరర్స్ సమ్మె చేయడం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపొతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టు లెక్చరర్స్ యొక్క న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల కార్యదర్శి చంద్రశేఖర్,మండల ఉపాధ్యాక్షులు ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment