అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవొద్దు-ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; అమరవీరుల దినోత్సవం సందర్బముగా జిల్లా ఎస్పీ సోమవారం తన క్యాంపు ఆఫీస్ లో ఉదయం పదకొండు గంటలకు స్వతంత్ర సమర యోదుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిముషాలు తమ ఆఫీసు సిబ్బంది తో సహా మౌనం పాటించారు. అదేవిదంగా జిల్లా వ్యాప్తముగా ప్రతి పొలిసు స్టేషన్ పరిథిలో అదికారులు తమ సిబ్బందితో స్వాతంత్ర అమరవీరుల త్యాగాలను స్మరిస్తు ప్రదాన కూడలిలో ప్రజలతొ కలిసి రెండు నిముషాలు మౌనం పాటించాలని అదేశించారు. ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ గారు మాట్లడుతూ ఎంతోమంది దేశ స్వాతంత్రము కొరకై తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రము సాధించారు. వారి త్యాగాలను మనం ఎప్పటికి మరవొద్దు. దేశ భవిష్యత్తు నేటి యువత మీద ఉందని అమరుల త్యాగాలను ఆదర్శముగా తీసుకోని దేశ సేవకు ఎప్పుడు ముందుండాలని అయన కొరారు. ఈ కార్యక్రమములో ఎస్ బి ఎస్ ఐ లు శ్యామ్ సుందర్ శివకుమార్ వెంకటస్వామి మరియు సిబ్బంది పాల్గోన్నారు.
No comments:
Post a Comment