Monday, 16 January 2017

స్కీమ్ వర్కర్ల దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయండి : అల్లూరి లోకేష్


స్కీమ్ వర్కర్ల దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయండి : అల్లూరి లోకేష్ 


కొమురం బీమ్  ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 16; రెబ్బెన ;  స్కీమ్ వర్కర్లు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలనీ సి ఐ టి యూ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ పిలుపునిచ్చారు సోమవారం రెబ్బెన అతిధి గృహం లో సమ్మెకు సంబందించిన గోడ పతులు విడుదలచేశారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల 20న  స్కీమ్ వర్కర్లు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను ఐకేపీ విఓఏ,అంగన్వాడీ ,ఆశ ,మధ్యనభోజన కార్మికులు ,ఎన్. హెచ్.ఎం,  సర్వశిక్ష అభియాన్,ఎన్ సిఎల్ పి ,ఎన్ అర్ ఎల్ఎమ్  ,కస్తూరిబాగాంధీ , స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని చేపట్టే సమ్మె ను విజయవంతం చేయాలన్నారు  కనీస వేతనం 18000/-ఇవ్వాలని , స్కీమ్ వర్కర్లతో రాష్ట్రప్రభుత్వం చేయిస్తున్న అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని , అందుకోసం బడ్జెటులో అదనపు నిధులు కేటాయించాలని  , స్కీమ్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాలలో పని చేస్తున్న వారితో సమానంగా వేతనాలు ,ఇతర సౌకర్యాలు అమలు చేయాలని  ,బకాయి పడ్డ వేతనాలను వెంటనే  చెల్లించాలని డిమాండ్ చేసారు.   టి.ఆర్.ఎస్. ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ,45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు అమలు చేయాలి, 2017-18 కేంద్ర బడ్జెట్ లో స్కిం లకు అవసరమైన నిధులను కేటాయించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు జి భీమేష్ ,డి తిరుపతి ,ఏ లింగన్న ,మాయ ,భారతి ,రాజేశ్వరి ,అనిత ,నిర్మల ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment