Thursday, 19 January 2017

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

ఎస్ వి  ఇంగ్లిష్ మీడియం  పాఠశాలలో  కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం ప్రైవేట్ పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను రెబ్బన మండల ఎంపీపీ కార్నాథం సంజీవ్ కూమార్,రెబ్బెన సిఐ మదన్ లాల్ ప్రారంభించారు.ఈ సందర్బంగ వారు మాట్లాడుతు మారుతున్న రోజులకు అనుగుణంగ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.విద్యార్థుల మేథ శక్తి మెరుగుపడడానికి  కంప్యూటర్ తోడ్పడుతుందని వారు అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రంలో ఎంపిడిఓ సత్యనారాయణసింగ్,ఎఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎన్.సదాశివ్,ఎంపిటిసి మద్దెల సురేందర్, పాఠశాల కరస్పాండెట్  దీకొండ విజయకుమారి , తెరాస జిల్లాఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్,ప్రధాన కార్యదర్శి చెన్న సోమశేఖర్,మోడెం సుదర్శన్ గౌడ్,చిరంజీవిగౌడ్, ప్రధానోపాధ్యాయుడు  దీకొండ సంజీవ్ కుమార్ .ఎ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి  పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి  రాయిల్ల నర్సయ్య, పాఠశాల కమిటీ సభ్యులు టి లక్ష్మణ్ , వసంత్ రావు పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment