Thursday, 6 August 2015

ఘనంగా ప్రోఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు


రెబ్బెన : మండలంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో ప్రోఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కన్వీనర్‌ గడ్డం లక్ష్మణ్‌, పాఠశాల ఉపాధ్యాయుడు అనీస్‌ అహ్మద్‌ మాట్లాడుతూ మన తెలంగాణ జాతిపిత, స్పూర్తిదాత ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు ఎన్‌.వెంకటేశ్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment