రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాఖి పౌర్ణమి సందర్భంగా మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రిని భక్తులకుఅందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు సుదర్శన్ గౌడ్, నవీన్ జైశ్వాల్,బొమ్మినేని శ్రీధర్, శంకరమ్మ , సోమశేఖర్, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్, నాయకులు హన్మంతు, దుర్గారావ్, సర్వేశ్వర్ గౌడ్ , వార్డు మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment