రెబ్బెన మండలంలోని గోలేటిలో గ్రామ పంచాయితి నిధులను దుర్వినియోగం చేసిన అవినీతి సర్పంచ్ తోట లక్ష్మణ్ పై గురువారం నాడు గ్రామ ప్రజలు గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఎస్సై సీఎచ్ హనూక్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దుర్వినియోగం చేసిన పంచాయితి నిధులను స్వాధీనం చేయాలని, క్రిమినల్ కేసు పెట్టాలని గతంలో కూడా పైఅధికారులకు ఫిర్యాదు చేయగా చెక్ పవర్ రద్దు చేశారు కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఇప్పటి కైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. ఏమ్పీటీసీ లావుడ్య మురళి బాయి, వార్డు సభ్యులు సుశీల,పుష్ప, తిరుపతి, తే,దే,పా జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేసరి ఆంజనేయిలు గౌడ్, మాజీ ఏమ్పీటీసీ కడతల మల్లయ్య, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్, ఎఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment