Friday, 7 August 2015

హిందూ సేవా సమితి తహసీల్దార్‌ కు వినతిపత్రం


రెబ్బెన : మండలంలోని హిందుసేవాసమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ రాంమోహన్‌ రావ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా హిందూసేవా సమితి వారు మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో స్మశాన వాటిక లేకపోవడంతో అధిక సంఖ్యలో నివాసముంటున్న హిందూ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మశానవాటిక కబ్జాకు గురైంది. ఆ స్థలం ఎక్కడుందో చూయిస్తే సరౌండింగ్‌ చేస్తామని అన్నారు. మండలాధికారులు స్మశానవాటికకు సరిపడ భూమిని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హస్‌ముక్‌లాల్‌, సుదర్శన్‌ గౌడ్‌, రపర్తి అశోక్‌, శంకర్‌ నాయక్‌, ధర్మారావ్‌ , జైస్వాల్‌, శేఖర్‌, లక్ష్మణ్‌,  అజ్మీర రమేశ్‌, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment