బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ సోమవారం నాడు రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ లోని కార్మికుల పునరావాస కేంద్రంలో కమిటీ హాల్ ని ప్రారంభించారు అనంతరం నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భుమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిభిరాన్ని ఏర్పాటు చేసారు. కార్మికుల కుటుంబాలకు పరీక్షించి మందులను పంపిణీ చేసారు. అనంతరం కార్మికుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భుపట్టాలను అందజేస్తామని అన్నారు. కార్మికుల బాగోగులే సంస్థకి ముఖ్యం అన్నారు వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువతన ఒక సంఘంగా ఏర్పడి ఉట్నూర్ ఆదిలాబాద్ వారిచే రిజిస్టర్ చేసుకొని ఆ పత్రాలను జీ,యం కార్యాలయం లో అందజేసి అర్హులైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగవకశాలను, పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో
డి,జి,యం చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ
,కార్యదర్శి యస్,తిరుపతి, ప్రాజెక్ట్ అధికారి సంజీవ్ రెడ్డి , డి,వై,పి,యం రాజేశ్వర్ రావు, డాక్టర్ రమ్య, వైద్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment