Thursday, 27 August 2015

గుడుంబా వద్దు - మంచి నీళ్ళే ముద్దు




రెబ్బెన మండలంలోని పులికుంట లో గురువారంనాడు  గ్రామజ్యోతి ప్రత్యేకాదికారి రెబ్బెన ఎస్ఐ  సిఎచ్ హనోక్ అద్వ్యర్యంలో గుడుంబా నివారణ కమిటీ తరపున ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా వద్దు - మంచి నీళ్ళే ముద్దు,గుడుంబా తాగకు - గుండె పగిలి చావకు, గుడుంబా మాని సుఖ సంతోషాలతో జీవించండి అంటూ నినదిస్తూ  గ్రామంలో అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడుంబా నివారణా కమిటి చైర్మన్ నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, డైరెక్టర్ సత్తన్న, పాతశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment