రెబ్బెనను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా -ఎంఎల్ఏ కోవ లక్ష్మి


రెబ్బెన గ్రామానికి అన్ని మౌలిక వసతులు కల్పించి జిల్లా లోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి అన్నారు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతీష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం నాడు ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి రెబ్బెనలో అన్నారు, రెబ్బెన గ్రామాన్ని దత్తతగా తీసుకొని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ఆమె మాట్లాడుతూ రెబ్బెనను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే దత్తతగా తీసుకొన్నానని అన్నారు,రెబ్బెనలో సి,సి, రోడ్లు,మురికి కాలువలు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు, ఆసిఫాబాద్ లో 5సం. అభివృద్ధిని 1సం,లోనే సాధించామని, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అలాగే రెబ్బన లోని సి,సి, రోడ్లు, డ్రైనేజిలు తదితర సమస్యల్ని 4సం, లో పరిష్కరిస్తానని అన్నారు,ప్రజలు కమిటి వేయడానికి పూర్తి సహకారం అందించాలని అన్నారు,రెబ్బెనలో యువత ఎక్కువగా ఉందని, చాలా ఉత్సాహంతో సహకరిస్తారని ఆమె తెలిపారు, నాయకులందరు పార్టీ లకు అతీతంగా అందరు సహకరిస్తేనే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దవచ్చని అన్నారు, కళ్యాణ లక్ష్మి,ఆసరా,ఆహార భద్రత పధకాలు పెదవారికే అందేలా అధికారులు చూడాలని ఆమె అన్నారు.ప్రత్యేక అధీకారి ఏపీఎమ్ రాజ్ కుమార్ కార్యక్రమంలోని వారికి ముఖ్య మంత్రి గారి ప్రసంగాన్ని వెల్లడించారు అనంతరం రెబ్బెన గ్రామ పంచాయితిని దత్తత తీసుకున్న సందర్భంగా ఎంఎల్ఏ కోవ లక్ష్మికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,ఎమార్వో రమేష్ గౌడ్,ఎంపీడీవో హలీం,ఎంఈవో వెంకటేశ్వర స్వామి,ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment