Friday, 7 August 2015

విద్యారంగ సమస్యలపై ఎ ఐఎస్‌ఎఫ్‌ నిరంతర పోరాటం


రెబ్బెన : దేశ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలపై ఎఐఎస్‌ఎఫ్‌ నిరంతర పోరాటాలు చేస్తుందని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీందర్‌ అన్నారు. ఈ సందర్బంగా ఎఐఎస్‌ఎఫ్‌ 80వ ఆవిర్బావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను డిగ్రీ కళాశాలలోఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బనారస్‌ యూనివర్సిటిలో ఎఐఎస్‌ఎఫ్‌ను స్థాిపించడం జరిగిందన్నారు. 80సంవత్సరాలు కావస్తున్నందున ఈనెల 12,13,14న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఆవిర్బావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు, ఈ వేడుకలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ సభ్యులు రవి, మండల అధ్యక్షుడు సాయి, రాజ్‌ కుమార్‌, మహిపాల్‌, తిరుపతి పాల్గొన్నారు.

No comments:

Post a Comment