Monday, 24 August 2015

అక్రమంగా తరలిస్తున్న 15టేకు దుంగలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 15 టేకు దుంగలు స్వాధీనం

శనివారం రాత్రి ఇండికా కారులో ( ఏపీ15బీఎమ్6848)అక్రమంగా తరలిస్తున్న 15 టేకు దుంగలను రెబ్బెన  మండలలంలోని సోనాపూర్ శివారులోని బ్రిడ్జి వద్ద  స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు దుండగులు  పారిపోయారని డీవైఆర్వో కె. శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీ. ఎఫ్ . వో వెంకటేశ్వర్లు తెలిపన సమాచారంతో డీ,వై,ఆర్వో కె. శ్రీనివాస్‌ పక్కా ప్రణాళికతో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 18850 రూపాయలు ఉంటాయని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. నిందితులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని, కలపతో కూడిన  ఇండికా  కారుని అదుపు లోకి తీసుకున్నామని తెలిపారు  . ఈ  సమావేశంలో  బీట్‌ అధికారులు ఎండీ అజరుద్దీన్‌, లత, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment