Sunday, 9 August 2015

ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి


కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఆదివారంతో 40వ రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజుల నుంచి కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నప్రభుత్వం కనికరం లేకుండాపోయిందని, ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను ఉద ్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఈ నెల 12న నిర్వహించే ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు ప్రకాష్‌, బాబాజీ, సోమశేఖర్‌, బిక్కు, విఠల్‌, సంతోష్‌, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment