టీ,ఆర్,ఎస్ నాయకుల జెండా ఆవిష్కరణ వేడుకలు
రెబ్బెన మండలంలోని ప్రయాణ ప్రాంగాణం ఆవరణలో టీ,ఆర్,ఎస్ పార్టీ రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెబ్బెన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 69వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ,మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,మండల యూత్ ప్రెసిడెంట్ వెంకట్రాజం,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ,టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment