సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ శ్రమ దోపిడి చేస్తున్నారని ఏ,ఐ,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్ అన్నారు, ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతం చేయాలనీ సిఎంపీఎఫ్ రికవరీ చేయాలని ఉచిత వైద్య సేవ అందించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 16న కొత్తగుడెంలో జరిగే తెలంగాణా రాష్ట్ర మొదటి మహాసభలను నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు, ఈ సభలో భవిషత్ కార్యచరణ రూపొందించి తీర్మానం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు , ఏరియా లోని కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలనీ కోరారు, ఈ సమావేశంలో కార్యదర్శి సీఎచ్ అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్,నాయకులు వెంకన్న,సాయి,వివేక్, సుధాకర్,రమేష్,తదితర నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment