Friday, 21 August 2015

మద్యం వద్దు మంచి నీరు కావలి

మద్యం వద్దు మంచి నీరు కావలి-పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వం జిల్లా మహిళా అధ్యక్షురాలు 


 ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాలోని అన్ని మండలాలలో ఒక మద్యం దుకాణం విధానాన్ని వ్యతిరేకిస్తూ మద్యం వద్దు మంచీనీరు కావాలి అనే పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి రెబ్బెన  మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కే,జీ, టూ పీజీ విద్యను అమలు చేయాలని, ఆహార భద్రత కార్డుల విషయంలో ప్రజలు ప్రతినేల ఇబ్బంది పడుతున్నారని, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు తగ్గించాలని, చౌక ధరల దుకాణాలలో ఉల్లిగడ్డలు సరఫరా చేయాలని, డ్వాక్ర మహిళల రుణాలు మాఫీ చేయాలని,మహిళలపై దాడులను అరికట్టాలని, మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలాని, మండలానికో మహిళ పోలిస్ స్టేషన్ కావాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో తెలుగు దేశం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గజ్జల అనసూర్య, మండల మహిళా అధ్యక్షురాలు కాసర్ల లక్ష్మి, గోలేటి పట్టణ అధ్యక్షురాలు కాజల్ బిస్వాస్, మండల తే,దే,పా అధ్యక్షులు, రెబ్బెన గ్రామ పంచాయితి ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, బొంగు నరసింగారావు తదీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment