Wednesday, 19 August 2015

గ్రామ జ్యోతి కార్యక్రమంలో పారిశ్యుద్ధం- ఎంఎల్ఏ కోవ లక్ష్మి




తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతీష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యాక్రమం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామ పంచాయితోలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, బుధవారం నాడు గ్రామ జ్యోతి  పారిశ్యుద్ధం కార్యక్రమంలో భాగంగా రెబ్బెనలోని వీదులలో రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను  తొలగించారు, రోడ్లపై ఉన్న చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు, గ్రామంలోని అన్ని బావులలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు,ఈ కార్యక్రమంలో రెబ్బెన యువకులు,ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ,మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment