Saturday, 1 August 2015

తల్లి పాలే బిడ్డలకు శ్రేయస్కరం


రెబ్బన : కన్న తల్లి పాలే బిడ్డలకు శ్రేష్టమని తల్లి పాలు బలం ఇవ్వడమే కాక వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, లక్ష్మి అన్నారు. రెబ్బెన లో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్‌ వాడీ కార్యక ర్తలు వీధుల గుండా శనివారం ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వరకు జరుగుతాయని ప్రతి అంగన్‌ వాడీ కార్యకర్త తల్లి పాల ప్రాముఖ్యత వివరించాలన్నారు. ఈ ర్యాలీలో సర్పంచ్‌ వెంకటమ్మ బాలమ్మ, చంద్రకళ , సంధ్యారాణి పాల్గొన్నారు.

No comments:

Post a Comment