Saturday, 1 August 2015

ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగం


రెబ్బెన : కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్దికై ప్రవేశపెట్టిన పథకాలలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని వాటిపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలని ఎమ్‌ఆర్‌పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ కేశవరావు మాదిగ అన్నారు. రెబ్బెనలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. అమాయక ఎస్సీ ఎస్టీ ప్రజలను దలారులు మండలనాయకులు మోసం చేసి లక్షలాది రూపాయలు కార్పోరేషన్‌ ద్వారా లబ్ది పొందుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పేర్లతో ఆటోలు లారీలు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేస్తూ పొట్టకొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంపల్లి ప్రభాకర్‌, ఇప్ప నాగరాజు, మండల అధ్యక్షులు నర్సింగరావు, మండల ప్రధాన కార్యదర్శి సిరివల్ల నర్సింహులు పాల్గొన్నారు

No comments:

Post a Comment