Saturday, 1 August 2015

ప్రధానోపాధ్యాయునికి వీడ్కోలు


రెబ్బెన : ఇం ద్రనగర్‌లోని ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన డి. శ్రీనివాసుల సేవలు మరవలేవని రెబ్బెన తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌, ఎంఈవో మహేశ్వరెడ్డిలు అన్నారు. శనివారం బదిలీపై వెళుతున్న శ్రీనివాసులకి ఘనంగా సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మహేశ్వరెడ్డి మాట్లాడుతూ పాఠశాలను జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్ధిన ఘనత శ్రీనివాసికే దక్కిందని అన్నారు. పీఆర్‌టీయూ ప్రె సిడెంట్‌ ఖాదర్‌, హెచ్‌ఎం రవికుమార్‌, నాయకులు, విద్యాకమిటీ చైర్మన్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment