Monday, 3 August 2015

తల్లి పాల వారోత్సవాల అవగాహన సదస్సు

రెబ్బెన మండలంలోని  గోలేటి గ్రామ పంచాయతీలోని కమ్యునిటి హాలులో  సోమవారం నాడు  తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని జరుపుకున్నారు, ఐసిడీఎస్  సీడీపీఓ మమత ఈ సందర్బంగా గర్బిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తల్లి పాలే బిడ్డలకు శ్రేష్టమని వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు, గర్బిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వనజ,మురళీధర్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌, సూపర్‌వైజర్‌ లక్ష్మీ, భాగ్యలక్ష్మీలు, జీపీ లోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం లు,ఆశ కార్యకర్తలు,గర్బిణీలు, బాలింతలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment