Thursday, 6 August 2015

టీఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో ఘనంగా జయ శంకర్‌ జయంతి వేడుకులు




రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌ షిప్‌లో గల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో ప్రోఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన మహిళ కార్యదర్శి కుందారపు శంకరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయన ప్రతిపాదించిన ఆశయాలను అందరూ పాటించాలని, ఆయన ఆశయసాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్‌, టౌన్‌ అధ్యక్షుడు మోర్లె నరేందర్‌, ప్రధాన కార్యదర్శి గోలెం ఇలాస్‌, సర్పంచ్‌ తోట లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ బోలేటి ప్రెసిడెంట్‌ బి.అశోక్‌, ఎంపీటీసీ వనజ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment