ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఎంపీ గెడెం నగేష్ కు వినతి పత్రం
రెబ్బెన లోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ నుండి రాకపోకలు జరుపే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని ఎంఎల్ఎ కొవలక్ష్మి, అధ్యక్షుడు పురాణం సతీష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ కు రెబ్బెన ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లేక స్టేషన్ వెనకాల ఉన్న కాలనివాసులు, వ్ర్రుద్దులు ; మహిళలు ; పిల్లలు;వికలాంగులు ఫ్లాట్ ఫాం 1 నుండి ఫ్లాట్ ఫాం 2 వైపు వెళ్ళడానికి ఈబ్బందీగా వుందని, అదే విధంగా జనవరి నెలలో ఆసిఫాబాద్ కి చెందిన అబ్దుల్ నయిం అనే సైకిల్ వ్యాపారి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. అదే విధంగా తెలంగాణ రైలును ఆపాలని అసిఫాబాద్ నియోజక వర్గానికి గల ఎకైక రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నుండి రోజుకు దాదాపు 800 మంది ప్రయాణికులు అసిఫాబాద్ ,వాంకిడి, కేరమెరి, జైనూరు ,రెబ్బెన మండలాల మరియు గోలేటి, నంబాల, గంగాపూర్, జక్కులపల్లి, కొమురవెళ్ళి, నార్లాపూర్, పుంజుమేరగూడ, సింగల్ గూడ, కొండపల్లి, వాంకిడి, కెరమెరి గ్రామాల ప్రజలు ఈ స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తున్నారని . నిజాం కాలం నాటి ఈ రైల్వే స్టేషన్ దాదాపు 50 సం,, రాల అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఈప్పటికీ ఏఅబివృద్దికి నోచుకోలేదు మురుగుదోడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారులు మారినా పట్టించుకోవడం లేదని అన్నారు, ఈ కార్యాక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, జిల్లా తెరాస ఉపాధ్యక్షులు నవీన్ జైశ్వాల్, గోలేటి ఉపసర్పంచ్ రవి నాయక్, వార్డు మెంబర్ చిరంజీవి, వెంకట్రాజం, రెబ్బెన మండల ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment